సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 3 మార్చి 2021 (10:26 IST)

పబ్జి గేమ్‌తో రెండు గ్రామాల మధ్య గొడవ.. కర్రలతో కొట్టుకుంటున్నారట!

భారతదేశంలో పబ్జి గేమ్ బ్యాన్ చేసినా సరే చాలా మంది వివిధ రకాల టెక్నాలజీలు ఉపయోగించి పబ్జి గేమ్ ఆడుతూనే ఉన్నారు. ఇప్పుడు సదరు పబ్జి గేమ్ కృష్ణా జిల్లాలో రెండు గ్రామాల మధ్య ఘర్షణకు కారణమైంది. కృష్ణా జిల్లా నూజివీడులో ఈ పబ్జి వలన ఘర్షణ చోటు చేసుకుంది. రెండు గ్రామాలకు చెందిన విద్యార్థులు బస్సులో ఘర్షణకు దిగినట్లు చెబుతున్నారు.
 
ఈ ఘర్షణ పెద్దది కావడంతో రెండు గ్రామాల మధ్య ఘర్షణగా మారిందని చెబుతున్నారు. కృష్ణా జిల్లాలోని కొత్తూరు తండా అలాగే సిద్ధార్థ నగర్ గ్రామాల మధ్య ఈ వివాదం మొదలైంది. కర్రలు రాళ్లతో పరస్పరం రెండు గ్రామాల మధ్య దాడులు జరిగినట్లు తెలుస్తోంది. పబ్జి ఆడే సమయంలో ఒకరినొకరు దూషించుకున్న కారణంగా ఈ వివాదం మొదలైంది అని ప్రచారం జరుగుతుంది. అయితే ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు అందాల్సి ఉంది.