1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Hyderabad: Techie ends life, cops suspect harassment

పబ్‌కెళ్లిన దంపతులు.. ఇంటికొచ్చాక టెక్కీ వైఫ్ సూసైడ్.. ఎందుకని?

హైదరాబాద్ నగరంలో ఓ మహిళా టెక్కీ ఆత్మహత్య చేసుకుంది. రాత్రి పబ్‌కెళ్లి ఇంటికొచ్చిన ఆమె ఆ తర్వాత బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

Hyderabad
హైదరాబాద్ నగరంలో ఓ మహిళా టెక్కీ ఆత్మహత్య చేసుకుంది. రాత్రి పబ్‌కెళ్లి ఇంటికొచ్చిన ఆమె ఆ తర్వాత బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్ లంగర్‌హౌజ్‌కు చెందిన ఉజ్వల్, మనస్థలిపురంకు చెందిన రేఖ(30)లు పదేళ్ళ క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. వీరంతా చందానగర్‌లోని అపర్ణ గార్డెనియా ప్లాట్ నెంబర్ 801ఏలో నివశిస్తున్నారు.
 
అయితే, దంపతులిద్దరూ గచ్చిబౌలిలోని ఐబీఎం సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్నారు. రేఖ కుటుంబ బాధ్యతలను పట్టించుకోదని, ఇతరులతో ఫోన్లు మాట్లాడటం తనకు నచ్చదని ఉజ్వల్ ఆరోపిస్తున్నాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. కాగా, రాత్రి దంపతులిద్దరు గచ్చిబౌలిలోని ఓ పబ్‌కు వెళ్లారు. ఇంటికి వచ్చాక గొడవపడి వేర్వేరు గదుల్లో పడుకున్నారు. ఉదయం ఉజ్వల్ లేచి చూసే సరికి రేఖ ఫ్యానుకు చీరతో వేలాడుతూ కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దవాఖానకు తరలించారు. 
 
అయితే, రేఖ మృతిపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. రేఖ అత్మహత్య చేసుకుందా? లేక భార్యపైన కోపంతో భర్త ఉజ్వలే చంపి ఆత్మహత్యగా చిత్రీకరించాడా? అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 
About Writer
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
మధ్యప్రదేశ్‌లో కోచింగ్ సెంటర్ అలా చేశాడు.. ప్రొఫెసర్‌ను రోడ్డుపైకి లాక్కొచ్చి?