మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 5 మే 2018 (10:36 IST)

ప్రేమకు పెద్దలు ఒప్పుకోలేదు.. ప్రేయసి పురుగుల మందు తాగితే.. ప్రియుడు?

ప్రేమకు పెద్దలు అంగీకరించలేని ఓ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వనపర్తి జిల్లాలో చోటుచేసుకుంది. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం అప్పరాళ్ల గ్రామానికి చెందిన విక్రమ్, సుష్మితలు దాదాపు మూడేళ్ళుగా ప్రేమించ

ప్రేమకు పెద్దలు అంగీకరించలేని ఓ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వనపర్తి జిల్లాలో చోటుచేసుకుంది. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం అప్పరాళ్ల గ్రామానికి చెందిన విక్రమ్, సుష్మితలు దాదాపు మూడేళ్ళుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్ళి చేసుకోవాలనుకున్నారు. పెద్దలకు విషయం చెప్పారు. కానీ వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. 
 
పైగా ఇద్దరికీ వేరే సంబంధాలు చూడటం ప్రారంభించారు. ఈ క్రమంలో తాము ఇక కలిసి జీవించలేమని కారణంతో ఇక చనిపోవాలనుకున్నారు. తొలుత సుష్మిత ఇక ఈ లోకంలో బతకకూడదని నిశ్చయించుకుంది. దీంతో ఇంటివద్దే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. 
 
స్నేహితుల ద్వారా విషయం తెలుసుకున్న విక్రమ్ శ్రీరాంనగర్ దగ్గర రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడటంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.