శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 5 మే 2018 (09:32 IST)

మే 24న హైదరాబాద్‌లో తెలంగాణ మహానాడు-రమణకు బాబు క్లాస్

తెలుగుదేశం అధినేత చంద్రబాబు అధ్యక్షతన హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో తెలంగాణ టీడీపీ సర్వసభ్య సమావేశం జరిగింది. మే24న హైదరాబాద్‌లో తెలంగాణ మహానాడు నిర్వహించనున్నట్లు చంద్రబాబు ఈ సందర్భంగా ప్రకటించా

తెలుగుదేశం అధినేత చంద్రబాబు అధ్యక్షతన హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో తెలంగాణ టీడీపీ సర్వసభ్య సమావేశం జరిగింది. మే24న హైదరాబాద్‌లో తెలంగాణ మహానాడు నిర్వహించనున్నట్లు చంద్రబాబు ఈ సందర్భంగా ప్రకటించారు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడానికి అందరూ కృషి చేయాలని చంద్రబాబు పిలుపు నిచ్చారు. అన్ని జిల్లాల్లో కమిటీల నియామకం పూర్తి చేయాలని ఆదేశించారు.
 
అలాగే తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణపై తీరుపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. అమాయకంగా ఉంటే పార్టీ మనుగడ కష్టమని, ధైర్యంగా ఉండి అందరినీ కలుపుకుని పోవాలని రమణకు క్లాస్ తీసుకున్నట్లు సమాచారం. మెతక వైఖరి మానుకోవాలని, కఠినంగా వ్యవహరించాలని చంద్రబాబు రమణకు సూచించారు. మహానాడు తరువాత మళ్లీ వస్తానని అప్పటిలోగా పార్టీ కమిటీలు పూర్తి చేస్తానని రమణకు బాబు తెలిపారు.