శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : శుక్రవారం, 4 మే 2018 (11:50 IST)

డమ్మీ హోంమంత్రిని పెట్టుకుని చంద్రబాబు సెటిల్మెంట్స్ : ఆర్కే. రోజా

వైకాపా ఎమ్మెల్యే, మహిళా ఫైర్ బ్రాండ్ ఆర్కే. రోజా మరోమారు టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై మాటల తూటాలు పేల్చారు. డమ్మీ హోంమంత్రిని పెట్టుకుని చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్‌లు

వైకాపా ఎమ్మెల్యే, మహిళా ఫైర్ బ్రాండ్ ఆర్కే. రోజా మరోమారు టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై మాటల తూటాలు పేల్చారు. డమ్మీ హోంమంత్రిని పెట్టుకుని చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్‌లు సెటిల్మెంట్స్ చేస్తున్నారంటూ మండిపడ్డారు.
 
గుంటూరు జిల్లా దాచేపల్లిలో ఓ వృద్ధుడు కంబంధ హస్తాల్లో నలిగిపోయిన బాధిత బాలికను రోజా శుక్రవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, దాచేపల్లి ఘటన బాధాకరమన్నారు. ఈ దారుణ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. గుంటూరులోని 9 మంది మహిళాలపై అత్యాచారాలు జరిగాయని.. సీఎం నివాసం ఉండే జిల్లాలో ఇలాంటి ఘటనలు జరగడం సిగ్గుచేటన్నారు.
 
ఏపీ హోమ్ మంత్రి హోంలో కూర్చునే మంత్రిలా తయారయ్యారని ఎద్దేవా చేశారు. పోలీసులు టీడీపీకి బౌన్సర్లుగా తయారయ్యారు. సీఎం పెళ్లిళ్లకు వెళ్తారు, బాలికను వచ్చి చూడటానికి సమయం లేదా?. కాల్ మనీ సెక్స్ రాకెట్‌లో అధికార పార్టీ నేతల పాత్రను ప్రజలు కళ్లారా చూశారు. నైతిక బాధ్యత వహిస్తూ చంద్రబాబు రాజీనామా చేయాలి.
 
అంతేకాకుండా, డమ్మీ హోంమంత్రిని పెట్టుకుని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ సెటిల్మెంట్ చేసుకుంటున్నాంటూ తీవ్ర విమర్శలు చేశారు. తొమ్మిదేళ్ళ బాలికపై అత్యాచారం జరిగినందుకు పోలీస్ వ్యవస్థ సిగ్గుపడాలి, డీజీపీ భాదపడ్డాను అని చెప్పడం సిగ్గుచేటని ఆమె వ్యాఖ్యానించారు. 
 
అదేసమయంలో బాలికలు, యువతులు, మహిళలపై అత్యాచారాలు వంటి నేరాలకు పాల్పడే వారిని ఉరి తీయాలని ఆమె డిమాండ్ చేశారు. మహిళలకు రక్షణ కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఆడవారి మానప్రాణాలు కాపాడే వారే లేరా?. ముఖ్యమంత్రి టెక్నాలజీ అంటూ ఉంటారు.. అత్యాచారాలను అడ్డుకోలేరా? అంటూ ఆమె నిలదీశారు. అసలు ఏపీలో టీడీపీ నేతల నుంచే మహిళలకు రక్షణ లేకుండా పోయిందని రోజా ఆరోపించారు.