శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Srinivas
Last Modified: శుక్రవారం, 4 మే 2018 (11:34 IST)

దాచేపల్లి కామాంధుడు సుబ్బయ్య ఆత్మహత్య చేసుకున్నాడా ?

దాచేపల్లిలో 9 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన కామాంధుడు సుబ్బయ్యను పట్టుకోవడానికి పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. సుబ్బయ్య ఆచూకీ తెలిపిన వారికి ప్రభుత్వం పారితోషికం ప్రకటించడం, సుబ్బయ్య ఫోటోలతో పోస్టర్లు విడుదల చేయడంతో ఈ కేసును సీరియస్‌గా తీసుకున్నారు

దాచేపల్లిలో 9 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన కామాంధుడు సుబ్బయ్యను పట్టుకోవడానికి పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. సుబ్బయ్య ఆచూకీ తెలిపిన వారికి ప్రభుత్వం పారితోషికం ప్రకటించడం, సుబ్బయ్య ఫోటోలతో పోస్టర్లు విడుదల చేయడంతో ఈ కేసును సీరియస్‌గా తీసుకున్నారు పోలీసులు. అయితే  సుబ్బయ్య తన బంధువులకు ఫోన్ చేసి.. తాను చనిపోతున్నట్టుగా చెప్పినట్టు సమాచారం. 
 
ఇదే విషయాన్ని బంధువులు పోలీసులకు తెలియజేయడంతో సుబ్బయ్య సెల్ ఫోన్ సిగ్నల్‌ను ట్రేస్ చేశారు పోలీసులు. చివరగా ఫోన్ సిగ్నల్స్ కృష్ణానది తీరంలో సెల్ టవర్‌ను చూపించడంతో సుబ్బయ్య నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలో పోలీసులు నదిలో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.