మంగళవారం, 21 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 24 జూన్ 2022 (12:47 IST)

ఇంటర్‌లో ఫెయిల్.. డ్యామ్ మీద నుంచి కిందకు దూకేశాడు..

suicide
చిన్న చిన్న కారణాలకే విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. తాజాగా ఏపీలో ఇటీవల ఇంటర్ పరీక్షలు విడుదలయ్యాయి. ఇంటర్‌లో ఫెయిల్ అయి కారణంగా అశోక్ అనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలోని పుచ్చకాయల పల్లిలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. పుచ్చకాయలపల్లి గ్రామానికి చెందిన వజ్రాల అశోక్ రెడ్డి ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ చదువుతున్నాడు. ఇటీవల విడుదలైన ఫలితాల్లో ఫెయిల్ అయ్యాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. 
 
మధ్యాహ్నం 12 గంటల సమయంలో స్నేహితులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చి, సుంకేసుల గ్యాప్ వెలుగొండ ప్రాజెక్టు డ్యామ్ మీద నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
 
విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు సంఘటన ప్రాంతానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.