గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 4 మార్చి 2020 (15:01 IST)

వ్యభిచార గృహంలో 'జబర్దస్త్' కామెడీ షో నటులు...

విశాఖపట్టణంలో ఓ ఇంట్లో వ్యభిచారం సాగిస్తున్నట్టు తెలుసుకున్న పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో జబర్దస్త్‌ కామెడీ షోకి చెందిన ఇద్దరు నటులను పట్టుకున్నారు. వారిని టాస్క్ ఫోర్స్ పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. 
 
విశాఖ మాధవధారలోని ఓ బహుళ అంతస్తు భవనంలో వ్యభిచారం నిర్వహిస్తున్న వారిపై పోలీసులు దాడికి పాల్పడ్డారు. ఒక మహిళతో పాటు నలుగురు విటులను పోలీసులు పట్టుకున్నారు. విటులలో ఇద్దరిని దొరబాబు, పరదేశిగా గుర్తించారు. వీరిరువురూ జబర్దస్త్ కామెడీ షోలో హైపర్ ఆది టీమ్‌కు చెందిన వారు కావడం గమనార్హం.