1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Jagan wishes for christmas

క్రిస్మస్‌ సందర్భంగా జగన్‌ శుభాకాంక్షలు

Jagan
క్రిస్మస్‌ పర్వదినం సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. సాటి మనుషుల పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమ, ఆకాశమంతటి సహనం, అవధులు లేని త్యాగం, శాంతియుత సహజీవనం, శత్రువుల పట్ల సైతం క్షమా గుణం.

ఇవన్నీ తన జీవితం ద్వారా మానవాళికి క్రీస్తు ఇచ్చిన మహోన్నత సందేశాలని, క్రీస్తు బోధనలు ఎప్పటికీ మనుషులందరినీ సన్మార్గంలో నడిపిస్తాయని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ పేర్కొన్నారు.
 
 రాష్ట్ర ప్రజలందరికీ మంచి జరిగేలా ఎల్లప్పుడూ దేవుడి ఆశీస్సులు లభించాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.
About Writer
ఎం
తర్వాతి కథనం
తూర్పుగోదావరి జిల్లాలో కొత్తరకం కరోనా!