1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Judge commits suicide in Tirupati

తిరుపతిలో సీనియర్ సివిల్ జడ్జి ఆత్మహత్య

తిరుపతిలో విషాదం జరిగింది. సీనియర్ సివిల్ జడ్జీగా విధులు నిర్వహిస్తూ గత యేడాదికాలంగా సస్పెన్షన్‌లో ఉన్న జడ్డి ఒకరు తన ఇంట్లోనే ఫ్యానుకు ఉరివేసుకున్నాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే

Judge
తిరుపతిలో విషాదం జరిగింది. సీనియర్ సివిల్ జడ్జీగా విధులు నిర్వహిస్తూ గత యేడాదికాలంగా సస్పెన్షన్‌లో ఉన్న జడ్డి ఒకరు తన ఇంట్లోనే ఫ్యానుకు ఉరివేసుకున్నాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
కృష్ణా జిల్లా మచిలీపట్నంకు చెందిన సదానందమూర్తి గత రెండేళ్ల క్రితం తిరుపతి ఏఎస్జే కోర్టు జడ్జిగా నియమితులయ్యారు. క్రమశిక్షణాపరమైన అంశాలపై ఆయనను యేడాది కిందట సస్పెండ్‌ చేశారు. దీంతో అధికారిక నివాసాన్ని వదిలి... బయట అద్దె ఇంట్లో ఉంటున్నారు. సస్పెన్షన్‌ నేపథ్యంలో ఆయన తీవ్ర మనస్తాపంతో ఉన్నట్లు తెలుస్తోంది. 
 
ఈ నేపథ్యంలో ఆయన తిరుపతి విద్యానగర్‌లో నివశించే అద్దె ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి రుయా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం... మృతదేహాన్ని అనంతరం ఆయన స్వస్థలానికి తరలించారు. జడ్జి బలవన్మరణానికి కారణాలేమిటో పోలీసులు వెల్లడించలేదు. సదానందమూర్తికి భార్య, ఇద్దరు కుమారులున్నారు. 
About Writer
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
పొరుగింటి వ్యక్తితో అక్రమ సంబంధం.. భర్తను 8 ముక్కలుగా నరికి?