ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : గురువారం, 16 నవంబరు 2017 (12:21 IST)

నెట్టింట చక్కర్లు కొడుతున్న నమిత వెడ్డింగ్ కార్డ్..

దక్షిణాది హీరోయిన్ నమిత త్వరలో పెళ్లికూతురు కాబోతోంది. ఈ నెల 24వ తేదీన నమిత- వీర్‌ల వివాహం జరుగనుంది. వీరా, నమిత కలిసి మియా అనే థ్రిల్లర్ ఫిలింలో కలిసి నటించగా, అప్పుడే వారిద్దరి మధ్య ప్రేమ పుట్టిందని

దక్షిణాది హీరోయిన్ నమిత త్వరలో పెళ్లికూతురు కాబోతోంది. ఈ నెల 24వ తేదీన నమిత- వీర్‌ల వివాహం జరుగనుంది. వీరా, నమిత కలిసి మియా అనే థ్రిల్లర్ ఫిలింలో కలిసి నటించగా, అప్పుడే వారిద్దరి మధ్య ప్రేమ పుట్టిందని సమాచారం. తాజాగా తన వివాహపు శుభలేఖను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ఇంకా తన ప్రేమకథను కూడా చెప్పేసింది. 
 
సెప్టెంబర్ ఆరో తేదీ 2017న వీర్ తనకు ప్రపోజ్ చేశాడని.. ఆ సమయంలో తేల్చుకోలేకపోయినా.. ఇద్దరి అభిరుచులు ఒకటే కావడంతో నో చెప్పలేకపోయానని వెల్లడించింది. మూడు నెలల పాటు అతనిని అర్థం చేసుకున్నానని.. అతనితో కలిసి వుండటాన్ని అదృష్టంగా భావిస్తున్నానని.. తమకు మద్దతిచ్చిన అందరీ కృతజ్ఞతలు తెలిపింది. 
 
ఇక తిరుపతిలో నమిత-వీర్‌ల వివాహం జరుగనుంది. ప్రస్తుతం పెళ్లి పనులతో బిజీగా ఉన్న ఈ జంట వెడ్డింగ్ కార్డులు పంచుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో నమిత, వీరు వెడ్డింగ్ కార్డ్ చక్కర్లు కొడుతుంది. 
 
నవంబర్ 22న వీరి సంగీత్ తిరుపతిలోని సింధూరి పార్క్ హయత్ హోటల్‌లో సాయంత్రం 7 గంటల 30 నిమిషాలకు జరగనుండగా, పెళ్లి నవంబర్ 24 శుక్రవారం తిరుపతిలోని ఇస్కా‌న్‌లో ఉదయం 5 గంటల 30 నిమిషాలకు జరగనున్నట్టు వెడ్డింగ్ కార్డ్‌న ద్వారా తెలుస్తోంది.