శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : ఆదివారం, 12 నవంబరు 2017 (17:48 IST)

క్యాండిల్ లైట్ డిన్నర్‌లో వీరు ప్రపోజ్ చేశారు.. 24న పెళ్లి : నమిత

బొద్దుపిల్ల నమిత తన పెళ్లిపై వస్తున్న వార్తలపై స్పష్టతఇచ్చారు. తన ప్రియుడు వీరేంద్ర చౌదరిని వివాహం చేసుకోనున్నట్టు ప్రకటించారు. తమ వివాహం ఈనెల 24వ తేదీన తిరుపతిలో జరుగుతుందని చెప్పారు.

బొద్దుపిల్ల నమిత తన పెళ్లిపై వస్తున్న వార్తలపై స్పష్టతఇచ్చారు. తన ప్రియుడు వీరేంద్ర చౌదరిని వివాహం చేసుకోనున్నట్టు ప్రకటించారు. తమ వివాహం ఈనెల 24వ తేదీన తిరుపతిలో జరుగుతుందని చెప్పారు. ఈ సందర్భంగా నమిత మాట్లాడుతూ, తన భర్త గురించి, తమ ప్రేమ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది.
 
వీరు తనకు బెస్ట్ ఫ్రెండ్ అని... అతను నిర్మాత మాత్రమే కాదు మంచి నటుడు కూడా అని చెప్పింది. తమది పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహం అని చెప్పింది. తమ కామన్ ఫ్రెండ్ శశిధర్ 2016లో తనకు వీర్‌ను పరిచయం చేశాడని... అలా తమ మధ్య స్నేహం ప్రారంభమైందన్నారు.
 
2017 సెప్టెంబర్ 6న బీచ్‌లో క్యాండిల్ లైట్ డిన్నర్‌ను ఏర్పాటు చేసి, వీర్ తనకు ప్రపోజ్ చేశాడని తెలిపింది. అలాంటి సర్‌ప్రైజ్‌ను తాను ఊహించలేదని... అయితే, తమ అభిరుచులు, అభిప్రాయాలు ఒకటే కావడంతో... వీర్ ప్రపోజల్‌కు ఓకే చెప్పేశానని తెలిపింది.
 
ఈ మూడు నెలల కాలంలో వీర్‌ను తాను ఎంతో అర్థం చేసుకున్నానని చెప్పింది. వాస్తవానికి మగవాళ్ల పట్ల తనకు నమ్మకం పోయిందని... కానీ, వీర్‌ను చూసిన తర్వాత పోయిన నమ్మకం మళ్లీ కలిగిందని తెలిపింది.