1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 12 నవంబరు 2017 (12:15 IST)

23న ఇంటివాడు కానున్న క్రికెటర్ భువనేశ్వర్

భారత క్రికెట్ జట్టులో ఉన్న యువ క్రికెటర్లలో భువనేశ్వర్ ఒకరు. ఈ క్రికెటర్‌కు పెళ్లి ఫిక్స్ అయింది. ఈ నెల 23వ తేదీన భువీ తన ప్రేయసి నుపుర్‌ నగార్‌ను పెళ్లాడనున్నాడు. ఆయన సొంత వూరు మీరట్‌లోనే వివాహం జరుగ

భారత క్రికెట్ జట్టులో ఉన్న యువ క్రికెటర్లలో భువనేశ్వర్ ఒకరు. ఈ క్రికెటర్‌కు పెళ్లి ఫిక్స్ అయింది. ఈ నెల 23వ తేదీన భువీ తన ప్రేయసి నుపుర్‌ నగార్‌ను పెళ్లాడనున్నాడు. ఆయన సొంత వూరు మీరట్‌లోనే వివాహం జరుగనుంది. 26న బులంద్‌షహర్‌లో రిసెప్షన్‌ ఉంటుంది. నవంబరు 30న ఢిల్లీలో మరో రిసెప్షన్‌ జరుగుతుంది. మీరట్‌లో జరిగే వివాహానికి బంధువులు, స్నేహితులు హాజరవుతారని తెలిపాడు. 
 
దీనిపై భువి తండ్రి కిరణ్ పాల్ సింగ్ స్పందిస్తూ, భువి వివాహంలో జట్టు సహచరులు, బోర్డు సభ్యులు కూడా మ్యారేజ్‌లో పాలుపంచుకోవాలని కోరుకుంటున్నాం.. కానీ ఆ టైంలో వీలుకాక పోవడంతో.. వారి కోసం ఢిల్లీలో రిసెప్షన్‌ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అందరూ కార్యక్రమానికి హాజరవుతారని భావిస్తున్నాం. ఎందుకంటే శ్రీలంకతో సిరీస్‌ కోసం జట్టంతా నవంబరు 30న ఢిల్లీలోనే ఉంటుందని చెప్పుకొచ్చాడు.