బుధవారం, 8 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 23 అక్టోబరు 2017 (09:27 IST)

తొలి వన్డేలో కివీస్ గెలుపు: కోహ్లీ శతకం సాధించినా నో యూజ్.. టీమిండియా ఓటమి

న్యూజిలాండ్ తొలి మ్యాచ్‌లోనే ఆతిథ్య జట్టుకు దిమ్మదిరిగే షాకిచ్చింది. టీమిండియా తొలి వన్డేలో కివీస్ చేతిలో పరాజయం పాలైంది. టామ్‌ లాథమ్‌, రాస్‌ టేలర్‌ అద్భుత ప్రదర్శనతో వన్డే సిరీస్‌లో బోణీ కొట్టింది. త

న్యూజిలాండ్ తొలి మ్యాచ్‌లోనే ఆతిథ్య జట్టుకు దిమ్మదిరిగే షాకిచ్చింది. టీమిండియా తొలి వన్డేలో కివీస్ చేతిలో పరాజయం పాలైంది. టామ్‌ లాథమ్‌, రాస్‌ టేలర్‌ అద్భుత ప్రదర్శనతో వన్డే సిరీస్‌లో బోణీ కొట్టింది. తన 200వ మ్యాచ్‌లో కోహ్లీ శతక గర్జన చేసినా.. బౌలింగ్‌ వైఫల్యంతో భారత్‌ ఓటమిపాలైంది. వాంఖడే స్టేడియంలో ఆదివారమిక్కడ జరిగిన తొలి వన్డేలో కివీస్‌ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 
 
భారత్‌ నిర్దేశించిన 281 పరుగుల లక్ష్యాన్ని.. న్యూజిలాండ్‌ నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి మరో ఆరు బంతులు మిగిలుండగానే ఛేదించింది. ''మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌" టామ్‌ లాథమ్‌ (102 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 103 నాటౌట్‌) అజేయ శతకానికి తోడు రాస్‌ టేలర్‌ (100 బంతుల్లో 8 ఫోర్లతో 95) సూపర్‌ హాఫ్‌ సెంచరీతో రాణించడంతో విజయం తేలికైంది. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో కివీస్‌ 1-0తో ముందంజ వేసింది. 
 
భారత బౌలర్లలో బుమ్రా, భువనేశ్వర్‌, హార్దిక్‌, కుల్దీప్‌ తలో వికెట్‌ పడగొట్టారు. అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 280 పరుగులు చేసింది. భారత ఆటగాళ్లలో కెప్టెన్ కోహ్లీ (125 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 121) సెంచరీతో ఒంటరి పోరాటం చేశాడు. దినేష్‌ కార్తీక్‌ (37), ధోనీ (25) ఫర్వాలేదనిపించారు. చివర్లో భువనేశ్వర్‌ కుమార్‌ (26) ధాటిగా ఆడాడు. కివీస్‌ బౌలర్లలో ట్రెంట్‌ బౌల్ట్‌ నాలుగు, టిమ్‌ సౌథీ మూడు వికెట్లు పడగొట్టారు.