మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 23 అక్టోబరు 2017 (09:03 IST)

ఆసియా కప్ హాకీ.. కప్ గెలుచుకున్న భారత్.. మలేషియాపై గెలుపు

ఆసియా కప్ హాకీలో భారత జట్టు అదుర్స్ అనిపించింది. బంగ్లాదేశ్‌లోని ఢాకాలో జరిగిన ఈ పోటీలో భారత జట్టు దుమ్మురేపింది. అద్భుత ప్రదర్శనతో ఛాంపియన్‌గా నిలిచింది. ఫైనల్ పోరులో మలేషియాను 2-1తో ఓడించి ముచ్చటగా

ఆసియా కప్ హాకీలో భారత జట్టు అదుర్స్ అనిపించింది. బంగ్లాదేశ్‌లోని ఢాకాలో జరిగిన ఈ పోటీలో భారత జట్టు దుమ్మురేపింది. అద్భుత ప్రదర్శనతో ఛాంపియన్‌గా నిలిచింది. ఫైనల్ పోరులో మలేషియాను 2-1తో ఓడించి ముచ్చటగా మూడోసారి ఆసియా కప్‌ను గెలుచుకుంది. ఆదివారం మలేషియాతో ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్‌లో భారత్‌ గెలుపును సాధించింది.
 
ఈ మ్యాచ్‌లో మూడో నిమిషంలో రమణ్‌దీప్ సింగ్, 29వ నిమిషంలో లలిత్ ఉపాధ్యాయ్‌లు గోల్స్ అందించి భారత విజయంలో కీలకపాత్ర పోషించారు. శనివారం జరిగిన సూపర్-4 పోరులో పాకిస్థాన్‌ను 4-0 గోల్స్‌తో చిత్తు చేసిన భారత్ ఫైనల్లో ప్రవేశించింది. 
 
ఈ టోర్నీలో ఆడిన అన్ని మ్యాచ్‌లలోనూ భారత్ విజయం సాధించింది. ఒక్క కొరియాతో మ్యాచ్ మాత్రం 1-1తో డ్రా అయింది. మూడో స్థానం కోసం జరిగిన పోరులో కొరియాపై పాకిస్థాన్ 6-3 గోల్స్‌ తేడాతో విజయం సాధించి కాంస్యం సాధించింది.