శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 10 నవంబరు 2017 (12:54 IST)

శరత్ బాబుతో కాదు.. వీరాతో నమిత పెళ్లి (వీడియో)

సీనియర్ నటుడు శరత్ బాబుతో ప్రేమాయణం సాగిస్తోందని.. ఆయన్ని నమిత వివాహం కూడా చేసుకోనుందని వచ్చిన వార్తలకు చెక్ పెట్టే విధంగా ఓ వీడియో విడుదలైంది. ఈ వీడియోలో నమిత బిగ్ బాస్ స్నేహితురాలు రైజా నమిత త్వరలోన

సీనియర్ నటుడు శరత్ బాబుతో ప్రేమాయణం సాగిస్తోందని.. ఆయన్ని నమిత వివాహం కూడా చేసుకోనుందని వచ్చిన వార్తలకు చెక్ పెట్టే విధంగా ఓ వీడియో విడుదలైంది. ఈ వీడియోలో నమిత బిగ్ బాస్ స్నేహితురాలు రైజా నమిత త్వరలోనే పెళ్లి కూతురు కాబోతుందని ప్రకటించింది. శరత్ బాబుతో పెళ్లా.. ఆయనెవరు అనే దానిపై తర్వాత గూగుల్‌లో సెర్చ్ చేశానని నమిత క్లారిటీ ఇచ్చింది. 
 
సీనియర్ నటుడు శరత్ బాబు కూడా నమితతో పెళ్లి వార్తలను ఖండించాడు. ఈ  నేపథ్యంలో రైజా ఓ వీడియోను నెట్లో పోస్ట్ చేశారు. అందులో నమితా వీర అనే వ్యక్తిని వివాహం చేసుకోబోతున్నట్లు.. త్వరలో వివాహ తేదీని ప్రకటించనున్నట్లు తెలిపారు.
 
నమిత కొన్నేళ్లు వీరా ప్రేమలో వున్నట్లు సమాచారం. ఇక త్వరలో దంపతులు కానున్న నమిత-వీరాలకు రైజాతో పాటు స్నేహితులందరూ శుభాకాంక్షలు తెలపడం ఈ వీడియోలో వుంది. ఈ వీడియోను ఓ లుక్కేయండి.