విచారణ ఎదుర్కొనే దమ్ములేకపోతే.. సీఎం జగన్ కాళ్లు పట్టుకోవచ్చు కదా..!

kodali nani
kodali nani
సెల్వి| Last Updated: శనివారం, 19 సెప్టెంబరు 2020 (15:47 IST)
అప్పట్లో వైఎస్‌ కాళ్లు పట్టుకొని విచారణలు ఆపించుకున్న చరిత్ర చంద్రబాబుకు ఉందని ఏపీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు. అమరావతి భూముల వ్యవహారానికి ప్రస్తావనకు తెచ్చిన నాని.. విచారణ ఎదుర్కొనే దమ్ములేకపోతే సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి కాళ్లు పట్టుకోవచ్చు కదా..అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఈ భూముల విషయం చర్చకు రాకుండా టీడీపీ సిగ్గులేకుండా అడ్డుకుంటోందని నాని విమర్శించారు. కేవలం తాను, తన సామాజిక వర్గమన్నదే చంద్రబాబు లక్షణమని మంత్రి విమర్శలు గుప్పించారు.

అమరావతిలో ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌ జరిగిందని.. రాజధాని ప్రకటనకు ముందే చంద్రబాబు అనుచరులు భూములు కొన్నారని నాని మరోసారి చెప్పుకొచ్చారు. అందుకే తమ ఆస్తులను కాపాడుకునేందుకే అమరావతినే రాజధానిగా చేయాలని డిమాండ్ చేస్తున్నారన్నారు. ఇన్‌సైడర్ ట్రేడింగ్‌లో దోషులు ఎంతటివారైనా చర్యలు తీసుకుంటామని ఎన్నికలకు ముందే చెప్పామన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా నాని తెలిపారు.

కొందరి స్వార్థం కోసం వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నారని తెలిపారు. అమరావతి భూ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు చేయాలని కేంద్రానికి సీఎం జగన్ లేఖ రాశారని మీడియా ముఖంగా తెలిపారు. ఏ రాజకీయ నేత తీసుకోలేని నిర్ణయాలను సీఎం జగన్ తీసుకుంటున్నారని.. ప్రజలకు మేలు చేయాలనే ఆయన నిజాయితీగా పనిచేస్తున్నారన్నారు.దీనిపై మరింత చదవండి :