సంబంధిత వార్తలు
- ఇదేనా మీరు చెప్పిన రైతు రాజ్యం?: జగన్ పై లోకేశ్ ఫైర్
- లోకేష్ పర్యటనలో దొంగలు పడ్డారు
- వర్షానికి, వరదకు లోకేష్ తేడా తెలుసుకోవాలి: మంత్రి కురసాల కన్నబాబు
- నాని గారూ, లోకేష్ అమెరికా వెళ్తే... హమ్మ! హమ్మ!! దివ్యవాణి ఎన్నేసి మాటలన్నది?
- జగన్మాత అనుగ్రహంతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి: మంత్రి కొడాలి నాని ఆకాంక్ష
లోకేష్ గురించి ఎక్కువగా మాట్లాడటం పరమ వేస్ట్: హమ్మ! కొడాలి నాని ఎంత మాటనేశాడు?
మంత్రి కొడాలి నాని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్‌పై తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇవాళ నందిగామలో పర్యటించిన ఆయన.. పలు విషయాలపై మాట్లాడారు. ఈ సందర్భంగా లోకేష్ ట్రాక్టర్ నడపడంపై మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
‘దొంగలు పడిన ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్టుగా ఉంది. వరదలు ఎప్పుడు వచ్చాయి. ఎప్పుడు పరిశీలిస్తున్నారు. మొదటి ట్రిప్పు తలకాయ ఉన్న వాడు కొల్లేరులో పెట్టుకుంటారా..?. లోకేష్ ఆఫ్ నాలెడ్జ్.. పార్టీ నడపడం రాదు, ట్రాక్టర్ నడపడం రాదు.
తెలుగుదేశం పార్టీ కూడా లోకేష్ నాయకత్వంలో కొల్లేటిలో ట్రాక్టర్ ఏ విధంగా దించాడో టీడీపీని కూడా దించుతాడు. బుద్ధి ఉన్నోడు ముందుగా దిగిపోండి ట్రాక్టర్ నుండి పార్టీ నుండి లోకేష్ గురించి ఎక్కువగా మాట్లాడటం పరమ వేస్ట్’ అని మంత్రి నాని వ్యాఖ్యానించారు.
నారా లోకేష్ పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పర్యటనలో భాగంగా వరద బాధిత ప్రాంతాల్లో ట్రాక్టర్ నడిపిన విషయం విదితమే. అయితే ఆ ట్రాక్టర్ అదుపు తప్పి కాల్వలోకి దూసుకెళ్లింది. పక్కనే ఉన్న టీడీపీ ఎమ్మెల్యే మంతెన రామరాజు అప్రమత్తమై ట్రాక్టర్‌ను కంట్రోల్ చేసి లోకేష్‌ను కిందికి దించేయడంతో పెను ప్రమాదమే తప్పింది.
అయితే ఈ ఘటనపై సోషల్ మీడియాలో వైసీపీ కార్యకర్తలు, కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు హేళన చేస్తూ మాట్లాడుతున్నారు.
తర్వాతి కథనం
