మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 20 అక్టోబరు 2020 (18:18 IST)

లోకేష్‌ పర్యటనలో దొంగలు పడ్డారు

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ గొల్లప్రోలు పర్యటనలో దొంగలు హల్‌చల్‌ చేశారు. ఈబీసీ కాలనీలో లోకేస్‌ పర్యటిస్తుండగా రద్దీ నెలకొంది. దాంతో టీడీపీ కార్యకర్తలు, నాయకులు జేబుల్లో నుంచి డబ్బును దొంగలు దోచుకుపోయారు.

మాజీ జడ్పీటీసీ మడికి ప్రసాద్‌వి రూ.5వేలు, టీడీపీ గొల్లప్రోలు మండలాధ్యక్షుడు ఉలవకాయల దేవేంద్రుడువి రూ.2,800, చిన జగ్గంపేట మాజీ ఎంపీటీసీ గుర్రం సుబ్బారావువి రూ.5 వేలు, కార్యకర్తలు ఇద్దరి జేబుల్లో నుంచి మరో రూ.10వేలు దోచుకెళ్లిపోయారు. బాధితులు గొల్లప్రోలు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.