మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 30 సెప్టెంబరు 2020 (17:01 IST)

బురద వదలి వరద బాధితులను ఆదుకోండి : లోకేశ్‌

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డిపై టిడిపి నేత నారా లోకేశ్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బురద రాజకీయాలను మాని, ముందు వరద బాధితులను ఆదుకోవాలని అన్నారు.

వరదల కారణంగా లంక గ్రామాలు మునిగిపోయాయని, ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పారు. రైతులు ఎంతో నష్టపోయారని, పత్తి, మినుము, పసుపు, కంద, అరటి, మిర్చి రైతులు కన్నీరు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

జగన్‌ చెబుతున్న నష్టపరిహార అంచనాలు, నష్టపరిహారం కేవలం పత్రికల్లో తప్ప క్షేత్ర స్థాయిలో కనిపించడం లేదని అన్నారు. అంచనా నివేదికలను త్వరితగతిన పూర్తి చేసి రైతులకు పరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు.