సంబంధిత వార్తలు
- మే 17తర్వాత ఏం చేద్దాం..? ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ
- వచ్చే ఆదివారం నుంచి దేశీయ విమాన సర్వీసులు
- స్థానిక ఎన్నికలు వాయిదా.. లాక్డౌన్ పొడగించాలని కోరిన సీఎం జగన్!!
- పూనమ్ పాండేకు చిక్కులు.. లాక్డౌన్ ఉల్లంఘించి స్నేహితుడితో చక్కర్లు
- రైళ్లకు గ్రీన్ సిగ్నల్ - తెలుగు రాష్ట్రాల మీదుగా వెళ్లే రైళ్ల వివరాలు...
నూజివీడులో కరోనా వైరస్ : జూన్ 8 వరకు లాక్డౌన్ పొడగింపు...
కృష్ణా జిల్లా నూజివీడులో కరోనా వైరస్ పాజిటివ్ కేసు నమోదైంది. దీంతో ఈ ప్రాంతంలో లాక్డౌన్‌ను వచ్చే నెల ఎనిమిదో తేదీ వరకు పొడగించారు. ఈ మేరకు తాహసీల్దారు ఎం. సురేష్ కుమార్ ఆదేశాలు జారీచేశారు.
స్థానిక మైలవరం రోడ్డుకు చెందిన ఓ మహిళకు నూజివీడు ఆసుపత్రిలో నిర్వహించిన వైరస్ నిర్ధారణ పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో పూర్తిస్థాయిలో నిర్ధారించుకునేందుకు ఆమె నుంచి మరిన్ని శాంపిల్స్ సేకరించి విజయవాడ పంపించారు. అక్కడ నిర్వహించిన పరీక్షల్లోనూ కరోనా పాజిటివ్ అని తేలింది.
దీంతో సోమవారం నుంచి 28 రోజుల పాటు.. అంటే జూన్ 8వ తేదీ వరకు నూజివీడు పట్టణంలో లాక్డౌన్ కొనసాగుతుందని తాహసీల్దారు వెల్లడించారు. రోడ్‌జోన్‌లో తప్ప మిగతా అన్ని ప్రాంతాల్లో ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకు మాత్రమే కూరగాయలు, నిత్యావసర దుకాణాలు తెరవాలని ఆయన ఆదేశించారు. కాగా, ఇప్పటికే కృష్ణలంక భ్రమరాంబపురంలోని సతీశ్ కుమార్ రోడ్డులో ఓ పాజిటివ్ కేసు ఉంది.
