సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 12 మే 2020 (11:36 IST)

లాక్డౌన్ వేళ ప్రేయసి ఇంటికి ప్రియుడు.. కొట్టి చంపేసిన అన్న... ఎక్కడ?

కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్రం లాక్డౌన్ అమలు చేస్తోంది. ఈ లాక్డౌన్ దెబ్బకు ప్రేమికులు, అక్రమ సంబంధాలు పెట్టుకున్న వారు తల్లడిల్లిపోతున్నారు. కొందరు ప్రేమికులు, వివాహేతర సంబంధాలు పెట్టుకున్నవారు తమ కోర్కెలను ఆపుకోలేక దొంగచాటుగా కలుస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కిపోతున్నారు. తాజాగా ఓ యువతి.. తన ప్రియుడిని ఇంటికి పిలిపించుకుంది. ఈ విషయం తెలిసి అన్న.. యువతిని కొట్టి చంపేశాడు. ఈ దారుణం తమిళనాడు రాష్ట్రంలోని పొల్లాచ్చి సమీపంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, పొల్లాచ్చి సమీపంలోని చిన్నపాళెయంకు చెందిన గౌతమ్ అనే యువకుడు, సూరస్వర పట్టి గ్రామానికి చెందిన 16 ఏళ్ల అమ్మాయి ప్రేమించుకున్నారు. గడచిన నెలన్నర రోజులుగా లాక్డౌన్ నిబంధనలతో ఇంటికే పరిమితమైన గౌతమ్, ప్రియురాలిని చూడలేక తపించాడు.
 
ప్రియుడి బాధను తట్టుకోలేకపోయిన ఆమె, ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని గమనించి, అతనికి సమాచారం చేరవేసింది. ఇదే అదునుగా భావించిన ఆమె ఇంటికి చేరుకున్నాడు. వారిద్దరూ గదిలో ఏకాంతంగా ఉండగా, అమ్మాయి తల్లి ఇంటికి వచ్చి, లోపలి నుంచి మాటలు వినిపించడంతో, వెంటనే భర్త, కుమారుడు, తమ్ముడిని పిలిపించింది. వారు ముగ్గురూ వచ్చి గౌతమ్ తలపై క్రికెట్ బ్యాటుతో దాడి చేశారు. తీవ్ర గాయాలపాలైన అతను చనిపోతాడన్న భయంతో పోలీసులను పిలిపించారు.
 
అతను తమ ఇంట్లోకి ఎవరూ లేని సమయాన్ని చూసి జొరబడ్డాడని, ఆత్మరక్షణ కోసం దాడి చేశామని కల్పిత కథను సృష్టించారు. గాయాలపాలైన గౌతమ్, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన తర్వాత, పోలీసులు తమ విచారణలో భాగంగా బాలికను గట్టిగా నిలదీయగా, అసలు విషయం చెప్పింది. దీంతో హత్య కేసు నమోదు చేసిన పోలీసులు, బాలిక తండ్రి, సోదరుడు, మేనమామను అరెస్టు చేశారు.