సంబంధిత వార్తలు
- ఇంటి నుంచే స్పందన.. ప్రత్యేక వెబ్‌సైట్, టోల్ ఫ్రీ నంబర్ : 1800–425–4440
- జగన్కు పనీపాటా లేదా : ప్రత్యేక హోదాపై కామెంట్స్ చేసే వారిపై జీవీఎల్ సెటైర్లు
- ఈ నెల 8న కియా కొత్త కారు ‘సెల్తోస్’ విడుదల... హాజరుకానున్న సీఎం
- ఆర్టికల్ 370 రద్దుతో తెలంగాణలో హైఅలర్ట్
- కశ్మీర్ విభజన.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ షాకింగ్ ట్వీట్
యథా సీఎం... తథా మంత్రి...నేతలపై నారా లోకేష్ మండిపాటు
టీడీపీ యువనేత లోకేష్ ముఖ్యమంత్రి జగన్ పై ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు. ఆయన ట్విట్టర్ లో ఏమన్నారంటే... "యథా సీఎం... తథా మంత్రి అన్నట్టు నోటికొచ్చిన అబద్ధాలతో ఎవరికివారు టీడీపీపై బురదచల్లేవారే కానీ ఈ ఆరోపణలపై కనీస అవగాహన కూడా ఉండటంలేదు వైసీపీ వాళ్ళకు. రిలయన్స్ కంపెనీ పేరుతో ఒక ఫేక్ కంపెనీని సృష్టించి 1000 ఎకరాలు కొట్టేసేందుకు టీడీపీ కుట్ర చేసిందని మంత్రి గౌతమ్ రెడ్డి ఆరోపించారు.
బాధ్యతారహితంగా ఆరోపణ చేసేముందు కనీసం ఒక రెండు నిముషాలు బుర్ర పెడితే సమాచారం అంతా ఇంటర్నెట్లోనే దొరికేది. రిలయన్స్ ప్రోలిఫిక్ ట్రేడర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది రిలయన్స్ ఇండస్ట్రీస్ కి చెందిన సంస్థ. సంస్థ ఫైనాన్సియల్ స్టేట్ మెంట్లు కూడా విడుదల చేసింది చూడండి.
మంత్రిగారు ఈ సంస్థనే ఫేక్ కంపెనీ అంటున్నారు. ఫేక్ కంపెనీ ఎక్కడైనా ఫైనాన్సియల్ స్టేట్ మెంట్ లు రిలీజ్ చేస్తుందా? ఇది కూడా తెలీని వారు అక్రమాలపై లోతుగా విచారణ చేస్తారంట. మంత్రిగారూ! ఫేక్ కంపెనీల గురించి తెలుసుకోవాలంటే మీ అధినేత నేర చరిత్రను ఒకసారి చదువుకోండి" అని లోకేష్ మండిపడ్డారు.
తర్వాతి కథనం
