1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. MLA on horse riding

గుర్రమెక్కిన ఎమ్మెల్యే.. గుడ్ మోర్నింగ్ అంటూ...

MLA
'గుడ్ మార్నింగ్ ధర్మవరం' అంటూ పలకరించే అనంతపురం జిల్లా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఈ సారి డిఫరెంట్ స్టైల్ లో కనిపించారు.

ప్రతిరోజు ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ పలు కాలనీల్లో పర్యటిస్తుంటారు. ఉదయాన్నే ఆయన కాలనీల్లో తిరగడం అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఆయన ఒక్కోసారి ఒక్కో స్టైల్ లో కనిపిస్తుంటారు.

బుల్లెట్టు లేదా మోడరన్ కార్ లో వస్తూ సందడి చేస్తుంటారు. అయితే ఇవాళ గుర్రంపై వచ్చి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు.

ధర్మవరం పట్టణ వీధుల్లో గుర్రపు స్వారీ చేస్తూ అందర్నీ ఆకర్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేతో ఫోటోలు దిగేందుకు పలువురు అభిమానులు పోటీపడ్డారు.
తర్వాతి కథనం
స్వర్ణప్యాలెస్ ఘటనలో రమేశ్ బాబు ఒక్కడిదే తప్పా?: టీడీపీ