1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Murasu cyclone update : Heavy Rain Alert

మురసు తుఫాను ఎఫెక్ట్ : కోస్తాంధ్రలో జోరు వర్షాలు

Heavy Rain
బంగాళాఖాతంలో కేంద్రీకృతమైవున్న మురసు తుఫాను ప్రభావం కారణంగా కోస్తాంధ్రలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఈ తుఫాను ప్రభావం అత్యధికంగా నెల్లూరుతో పాటు పలు జిల్లాలపై తుఫాను ప్రభావం సోమవారం నుంచే స్పష్టంగా కనిపిస్తోంది. ఆదివారం రాత్రి నుంచి నెల్లూరు, కాకినాడ, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కృష్ణపట్నం పోర్టులో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. సోమవారం నెల్లూరు జిల్లాలోని విద్యాసంస్థలకు కలెక్టర్ సెలవు ప్రకటించారు. 
 
తుఫాను ప్రభావంతో కృష్ణా, కాకినాడ, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. కాకినాడ, పరిసర ప్రాంతాల్లో ఆదివారం రాత్రి నుంచే వర్షం పడుతోంది. దీంతో నగర వీధులు జలమయమయ్యాయి. తునిలో సోమవారం తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తోంది. కృష్ణా జిల్లాలో చిరుజల్లులు పడుతున్నాయి. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురం, అంబాజీపేట ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.
 
శ్రీకాకుళం జిల్లాలోని నరసన్నపేట, జి.సిగడాం, సారవకోట, జలుమూరు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తుఫాను నేపథ్యంలో జిల్లా యంత్రాంగాన్ని మంత్రి అచ్చెన్నాయుడు అప్రమత్తం చేశారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని, విద్యుత్‌, తాగునీరు, వైద్యసేవలకు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ, విజయనగరం జిల్లా చీపురుపల్లి, వేపాడ మండలాల్లో వర్షం కురిసింది. 
 
భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది. మురసు తుఫాను దృష్ట్యా పలు సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు. ముందస్తు చర్యగా నేడు విశాఖపట్నం (భోగాపురం) ఎయిర్‌పోర్టు నుంచి విజయవాడ, తిరుపతి, హైదరాబాద్‌ వెళ్లాల్సిన విమాన సర్వీసులను రద్దు చేశారు. వాతావరణం అనుకూలించే వరకు ప్రయాణికులు ఎయిర్‌లైన్‌ స్టేటస్‌చెక్‌ చేసుకోవలని విమానాశ్రయ అధికారులు సూచించారు.
 
మురుసు తుఫాను నేపథ్యంలో పలు జిల్లాల్లో విద్యుత్‌శాఖ కంట్రోల్‌ రూమ్‌ నంబర్లను ఏర్పాటుచేసింది. సహాయం కోసం సంప్రదించాలని సూచించింది. టోల్‌ ఫ్రీ నంబర్‌ 1912ను కూడా అందుబాటులో ఉంచింది. ప్రజలు తెగిపడిన విద్యుత్ తీగలు, నేలకొరిగిన విద్యుత్ స్తంభాలను తాకకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
Borabanda: ఐదేళ్ల బాలుడిని హత్య చేసిన తండ్రి.. కారణం ఏంటి?