1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. MV Mysura Reddy quits active politics

రాజకీయాలను తప్పుకున్న ఎంవీ మైసూరా రెడ్డి

MV Mysura Reddy
ఉమ్మడి ఆధ్రప్రదేశ్ మాజీ హోం మంత్రి, రాయలసీమ ప్రాంతానికి చెందిన ఎంవీ మైసూరా రెడ్డి క్రియాశీలక రాజకీయాలకు తప్పుకున్నారు. ఈయన కాంగ్రెస్ పార్టీ నేతగా ఉండి, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు. పిమ్మట వైకాపా తీర్థం పుచ్చుకుని, అక్కడ నుంచి బయటకు వచ్చేశారు.
 
ఈ నేపథ్యంలో క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ఆయన ప్రకటించారు. రాయలసీమ హక్కుల సాధనపై కడపలో ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న మైసూరారెడ్డి మాట్లాడుతూ, రాయలసీమ అభివృద్ధి కోసం పాటుపడతానని, అవసరమైతే అన్ని పార్టీలనూ కలుపుకుని పోరాడతానని చెప్పారు. 
 
రాయలసీమ హక్కుల సాధన నిమిత్తం మహాసభ నిర్వహించాలని నిర్ణయించామని అన్నారు. రాయలసీమ సమస్యల పరిష్కారానికి మాజీ సీఎస్ అజయ్ కల్లం నేతృత్వంలో ఓ కమిటీ  ఏర్పాటు చేయనున్నట్టు మైసూరా రెడ్డి ప్రకటించారు.
తర్వాతి కథనం
క్లోమగ్రంథి కేన్సర్‌తో తుదిశ్వాస విడిచిన సర్జికల్ స్ట్రైక్స్ వ్యూహకర్త