రాజ్యసభకు ఏకగ్రీవంగా ఆ నలుగురు.. సీఎంతో భేటీ
Jagan
ఈ క్రమంలో రిటర్నింగ్ అధికారి నుంచి డిక్లరేషన్లు తీసుకున్న ఎంపీలు ఆర్.కృష్ణయ్య, బీద మస్తాన్ రావు, ఎస్.నిరంజన్ రెడ్డి.. ఈ రోజు సీఎం వైఎస్ జగన్ మెహన్ రెడ్డితో భేటీ అయ్యారు.
తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో తమను రాజ్యసభకు ఎంపిక చేసినందుకు వారు సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. బీసీల హృదయాల్లో సీఎం జగన్‌ది చెరగని ముద్ర అని బీద మస్తాన్ రావు అన్నారు. సీఎం ఆదేశాలతో రాష్ట్ర అభివృద్ధికి కృషిచేస్తానని ఆయన ప్రకటించారు.
