సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 4 జూన్ 2022 (09:28 IST)

ఏపీలో పదో తరగతి పరీక్షా ఫలితాలు - మార్కుల రూపంలో రిజల్ట్స్

ఏపీలో పదో తరగతి పరీక్షా ఫలితాలు శనివారం విడుదల అవుతున్నాయి. ఈ ఫలితాలను ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్  bse.ap.gov.in లోకి లాగిన్ అయి ఫలితాలను చూసుకోవచ్చు.

పరీక్షా ఫలితాలను విడుదల చేసేందుకు  రాష్ట్ర విద్యాశాఖ అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసింది. ఈరోజు ఉదయం 11 గంటలకు ఫలితాలు వెబ్ సైట్ లో అందుబాటులో ఉంటాయి. 
 
కరోనా వల్ల గత రెండేళ్లుగా పరీక్షలు లేకుండానే విద్యార్థులంతా ఇంటర్మీడియట్‌కు ప్రమోషన్ పొందారు. మహమ్మారి తీవ్రత పూర్తిగా తగ్గిపోవడంతో ఈ ఏడాది పరీక్షలను నిర్వహించారు. 
 
మొత్తం 6,21,799 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 3,00,063 మంది బాలురు కాగా... 3,02,474 మంది బాలికలు ఉన్నారు. 
 
రాష్ట్ర వ్యాప్తంగా 3,776 కేంద్రాల్లో పరీక్షలను నిర్వహించారు. ఈ సారి గ్రేడింగ్ రూపంలో కాకుండా, మార్కుల రూపంలో ఫలితాలను వెల్లడించనున్నారు.