1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 3 జూన్ 2022 (19:12 IST)

వైఎస్సార్ చేయూత పథకం.. మీరు అర్హులా కాదా అనేది తెలుసుకోవాలంటే?

YSR Cheyutha Scheme
YSR Cheyutha Scheme
ఏపీ సర్కార్ అందిస్తున్న పథకాల్లో వైఎస్సార్ చేయూత కూడా ఒకటి.  ఈ పథకం ద్వారా మహిళలకు లబ్ధి చేకూరుతుంది. ఒక్కొక్కరికి రూ.75వేల చొప్పున డబ్బు అందుతుంది. అయితే ఈ డబ్బులు ఒకేసారి కాకండా ప్రతి ఏటా ఒకసారి విడతల వారీగా లబ్ధిదారులకు చేరుతాయి. 
 
ఒక్కో విడత కింద రూ.18750 లభిస్తాయి. ఇప్పటికే రెండు విడతల డబ్బులు లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ అయ్యాయి. అంటే ఇంకో రెండు విడతల డబ్బులు మహిళల బ్యాంక్ ఖాతాల్లో జమ కావాల్సి ఉంది.  పథకం కోసం దరఖాస్తు చేసుకునే వారు https://navasakam.ap.gov.in/ అనే వెబ్ సైట్‌ను సంప్రదించాల్సి వుంటుంది. 
 
వైఎస్సార్ చేయూత పథకంలో చేరాలని భావించే వారికి 45 ఏళ్ల వయసు తప్పనిసరి. అలాగే 60 ఏళ్ల వరకు వయసు కలిగిన వారు పథకంలో చేరొచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు మాత్రమే జగన్ ప్రభుత్వం అందిస్తున్న ఈ చేయూత స్కీమ్ వర్తిస్తుంది. అలాగే ఆధార్ కార్డులోని వయసును ప్రామాణికంగా తీసుకుంటారు.  
 
ఏపీ ప్రభుత్వం వైఎస్సార్ చేయూత పథకం కింద మరో ప్రయోజనం కూడా కల్పిస్తోంది. ఈ పథకంలో భాగంగా అర్హత కలిగిన వారికి కిరాణా షాపులు, గేదెలు, ఆవులు, మేకల యూనిట్లు కూడా ఏర్పాటు చేయిస్తోంది. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం అమూల్‌, రిలయన్స్‌, పీఅండ్‌జీ, ఐటీసీ వంటి పలు సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇలా ఆసక్తి కలిగిన వారు రాష్ట్ర ప్రభుత్వం చేయూత అందిస్తోంది.
 
కావాల్సిన డాక్యుమెంట్లు ఇవే .
* వయస్సు రుజువు
* బ్యాంక్ ఖాతా పాస్‌బుక్
* పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు
* మొబైల్ నంబర్
* రేషన్ కార్డు
* చిరునామా రుజువు
* ఆధార్ కార్డ్
* కుల ధృవీకరణ పత్రం
* నివాస ధృవీకరణ పత్రం
 
పైన ఇచ్చిన అన్ని పత్రాలను దగ్గర వుంచుకొని మీ పరిధిలో ఉన్న గ్రామవాలంటీరును సంప్రదించాలి. గ్రామ వాలంటీరు మీ వివరాలన్నింటినీ సేకరించి మీరు ఈ వైఎస్సార్ చేయూత పథకానికి అర్హులా కాదా అని నిర్ణయిస్తారు.
 
ఈ పథకాలన్నింటికీ అప్లై చేసే ముందు మీ ఆధార్ మీ మొబైల్‌కు లింక్ చేసి ఉందో లేదో ఛూసుకొవాలి. లింక్ చేసిన మొబైల్ నంబర్ ను మీరు ఎప్పుడూ యాక్టివ్‌లో వుంచాలి. వెరిఫికేషన్ సమయంలో మీ ఆధార్ లింక్ మొబైల్ చాలా ఉపయోగపడుతుంది.