ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 13 ఆగస్టు 2021 (17:49 IST)

ఏపీకి కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌

ఏపీకి కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ రానున్నారు. నిర్మలమ్మకు ఎయిర్‌పోర్టులో ఏపీ బీజేపీ చీఫ్‌ సోము వీర్రాజుతో పాటు పలువురు బీజేపీ నేతలు ఘనస్వాగతం పలకనున్నారు.

అక్కడి నుంచి నరసాపురానికి చేరుకొని, ఓ ప్రైవేట్‌ ఫంక్షన్‌లో నిర్మలా సీతారామన్‌ పాల్గొననున్నారు. శనివారం మధ్యాహ్నం గన్నవరం నుంచి హైదరాబాద్‌కు చేరుకుంటారు.
 
ఇదిలా వుంటే.. గతవారం విశాఖలో పర్యటించారు.. నిర్మలా సీతారామన్. శ్రీకాకుళం జిల్లా పొందురులో నేషనల్ హ్యాండ్లూమ్ డే వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. 75 ఏళ్ల స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా అల్లూరి ఘాట్‌ను సందర్శించారు.