1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. One week lockdown in Guntur

ఆంధ్రప్రదేశ్‌లో పెరుగుతున్న కరోనా.. గుంటూరులో లాక్డౌన్

One week
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. దీంతో అధికారులు అప్రమత్త చర్యలు తీసుకుంటున్నారు. గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలంలో లాక్‌డౌన్‌ ప్రకటించారు. నేటి నుంచి వారం రోజుల పాటు లాక్‌డౌన్‌ అమలులో ఉండనుంది. కోవిడ్‌ కేసులు అధికంగా రావడంతో లాక్‌డౌన్ ప్రకటించినట్లు తహసీల్దార్‌ శ్రావణ్‌కుమార్‌ పేర్కొన్నారు. 
 
లాక్‌డౌన్‌ సమయంలో ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు నిత్యావసరాల కొనుగోలుకు అనుమతి ఇస్తున్నట్లు చెప్పారు. వారం రోజుల తర్వాత పరిస్థితిని సమీక్షించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇదిలా ఉండగా.. ఏపీలో బుధవారం 1184 మందికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అవగా.. నలుగురు మృతి చెందారు.
తర్వాతి కథనం
శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో పేలిన నాటు బాంబులు.. ప్రాణాలు కోల్పోయిన...