మాస్క్ ధరించని సర్కిల్ ఇన్‌స్పెక్టర్.. అపరాధం విధించిన ఎస్పీ

face mask
ఠాగూర్| Last Updated: మంగళవారం, 30 మార్చి 2021 (09:08 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా వివిధ రకాల చర్యలు చేపడుతోంది. ముఖ్యంగా, ముఖానికి మాస్క్ ధరించాలని, ప్రజలు అప్రమత్తంగా ఉంటూ సామాజిక భౌతిక దూరం పాటించాలని కోరింది. అయితే, ఇంత ప్రచారం చేస్తున్న మాస్క్ ధరించని ఓ సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌కు జిల్లా ఎస్పీ అపరాధం విధించారు. ఈ ఘటన ఏపీలోని గుంటూరు జిల్లాలో జరిగింది.

ఆదివారం గుంటూరు అర్బన్‌ పరిధిలో మాస్కు ధరించని వారిపై ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించారు. ఈ సమయంలో స్థానిక లాడ్జి కూడలిలో తుళ్లూరు ట్రాఫిక్‌ సీఐ మల్లికార్జునరావు మాస్కు ధరించకుండా అటుగా వెళ్లడాన్ని ఎస్పీ గుర్తించారు.

వెంటనే సీఐని దగ్గరికి పిలిచి మాస్కు ఎందుకు ధరించలేదని ప్రశ్నించారు. అత్యవసరంగా విధుల్లో హాజరవడానికి వెళుతూ మర్చిపోయినట్టు సీఐ సమాధానమిచ్చారు. ఈ సమాధానంతో సంతృప్తి చెందని ఎస్పీ.. సీఐకి అపరాధ రుసుం(ఫైన్‌) విధించాలని అధికారులను ఆదేశించారు. అంతేకాదు స్వయంగా మాస్కు తెప్పించి సీఐకి అందజేశారు.దీనిపై మరింత చదవండి :