కర్ణాటకలో కరోనా కట్టడికి చర్యలు.. మాస్క్ ధరించకపోతే.. రూ.250 ఫైన్

face mask
face mask
సెల్వి| Last Updated: గురువారం, 25 మార్చి 2021 (09:42 IST)
కర్ణాటకలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో ఆ రాష్ట్రం అప్రమత్తమైంది. వైరస్‌ కట్టడికి చర్యలు ప్రారంభించింది. కోవిడ్‌ నిబంధనలు పాటించని వారిపై చర్యలకు సిద్ధమైంది. బెంగళూరు మహానగర పాలికే (బీబీఎంపీ) పరిధిలో ఫేస్‌మాస్క్‌ ధరించకుంటే రూ.250 జరిమానా విధించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

అలాగే వేడుకలు, కార్యక్రమాల్లో పాల్గొనే వారి సంఖ్యపై ఆంక్షలు విధించింది. వివాహ వేడుకల్లో 200 మందికి, పుట్టిన రోజు వేడుకల్లో వంద మంది, అంత్యక్రియల్లో 50 మంది పాల్గొనవచ్చని పేర్కొంది. అంతేకాకుండా ఎయిర్‌ కండిషన్డ్‌ పార్టీ హాల్స్‌, డిపార్ట్‌మెంట్‌ సోర్ట్స్‌ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే భారీగానే జరిమానా విధించనున్నారు.

నిన్న ఒకే రోజు కర్ణాటకలో 2,298 కొవిడ్‌ కేసులు రికార్డవగా.. 12 మరణాలు నమోదయ్యాయని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 9,75,955కు చేరగా.. ఇప్పటి వరకు 12,461 మంది మృత్యువాతపడ్డారు.దీనిపై మరింత చదవండి :