గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 23 మార్చి 2021 (23:26 IST)

బాలీవుడ్ యువ హీరోకు కరోనా.. టెన్షన్‌లో మహేష్ హీరోయిన్! (video)

మహారాష్ట్రలో కరోనా విశ్వరూపాన్ని ప్రదర్శిస్తోంది. ఈ రాష్ట్రంలో కరోనా వైరస్ రెండో దశ వ్యాప్తి శరవేగంగా సాగుతోంది. దీంతో సామాన్యుల‌ే కాదు సెల‌బ్రిటీల‌ు సైతం ఈ వైరస్ బారినపడుతున్నారు. క‌రోనా నిబంధ‌నల‌ను జ‌నాలు గాలికి వ‌దిలేయ‌డంతో ఈ మ‌హ‌మ్మారి బుస‌లు కొడుతుంది. 
 
తాజాగా బాలీవుడ్ యువ హీరో కార్తీక్ ఆర్య‌న్‌కు క‌రోనా సోకింది. ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా త‌న సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేశారు. ప్ల‌స్ సింబ‌ల్ షేర్ చేస్తూ.. క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. త్వ‌ర‌గా కోలుకునేలా ప్రార్ధించండి అని ఆయ‌న పోస్ట్‌లో పేర్కొన్నారు.
 
అయితే కార్తీక్ ఆర్య‌న్ రీసెంట్‌గా జ‌రిగిన లాక్మీ ఫ్యాష‌న్ వీక్ హీరోయిన్ కియారా అద్వానీ, ప్ర‌ముఖ‌ డిజైనర్ మనీష్ మల్హోత్రాతో కలిసి హీరో కార్తీక్‌ ర్యాంప్‌ వాక్‌లో పాల్గొన్నాడు. దీంతో వారిద్ద‌రి గుండెల్లో గుబులు రేగుతుంది. 
 
మ‌రోవైపు రీసెంట్‌గా కియారా, టబులతో కలిసి భూల్ భులైయా 2 అనే సినిమా షూటింగ్‌లోనూ పాల్గొన్నాడు. దీంతో అంద‌రిక‌న్నా కియారాకు ఎక్కువ‌గా భ‌యం ప‌ట్టుకుంది. ప్ర‌స్తుతం కియారా క్వారంటైన్‌లో ఉన్న‌ట్టు తెలుస్తుంది. కాగా, భ‌ర‌త్ అనే నేను చిత్రంలో మ‌హేష్ స‌ర‌స‌న కియారా అద్వానీ న‌టించ‌గా, ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించింది.