గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : శనివారం, 20 మార్చి 2021 (16:21 IST)

పాకిస్థాన్ ప్రధాన మంత్రికి కరోనా పాజిటివ్.. టీకా వేయించుకున్నా..?!

దేశంలో కరోనా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. మహమ్మారి కరోనా వైరస్‌ రెండోసారి విజృంభిస్తోంది. ప్రపంచదేశాలతో పాటు భారత్‌లోనూ కోరలు చాస్తోంది. తాజాగా పాకిస్థాన్ ప్రధానమంత్రికి కరోనా పాజిటివ్‌ తేలింది. అయితే వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత పాజిటివ్‌ రావడం విస్మయం కలిగిస్తోంది. దీంతో పాకిస్తాన్‌లో కలకలం రేపుతోంది. ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ తాజాగా చేసుకున్న పరీక్షల్లో కరోనా నిర్ధారణ అయ్యింది. 
 
ఈ విషయాన్ని పాక్‌ వైద్య శాఖ మంత్రి ఫైజల్‌ సుల్తాన్‌ ప్రకటించారు. పాకిస్థాన్‌ ప్రధాని కార్యాలయం కూడా ఈ విషయాన్ని ట్వీట్‌ చేసింది. కాగా ఇమ్రాన్‌ ఖాన్‌ రెండు రోజుల కిందట చైనా అభివృద్ధి చేసిన కరోనా టీకా వేయించుకున్నారు. అనంతరం ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ గణాంకాల ప్రకారం పాకిస్తాన్‌లో ఇప్పటివరకు 6,23,135 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. కరోనావైరస్ మూలంగా 13,799 మంది చనిపోయారు.