సోమవారం, 18 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 6 మార్చి 2021 (18:43 IST)

విశ్వాస పరీక్షలో నెగ్గిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్..

ప్రధాని ఇమ్రాన్ ఖాన్ విశ్వాస పరీక్షలో గెలుపును నమోదు చేసుకున్నారు. దీంతో హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నారు. ఫలితంగా ఇమ్రాన్ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేకుండా పోయింది.

178 ఓట్ల మద్దతు ఆయనకు లభించింది. విశ్వాస పరీక్షలో ఆయన విజయం సాధించగానే ''ఇమ్రాన్ ఖాన్ జిందాబాద్' అన్న నినాదాలు ఒక్కసారిగా పార్లమెంట్‌లో మార్మోగాయి. విశ్వాస పరీక్ష నెగ్గడానికి ఆయనకు 171 ఓట్ల మద్దతు అవసరం ఉంది. కానీ 178 ఓట్ల మద్దతు లభించి, ఆయన విశ్వాస పరీక్షలో విజయం సాధించారు. 
 
సెనెట్‌కు జరిగిన ఎన్నికల్లో ఇమ్రాన్ కేబినెట్‌లోని ఆర్థిక మంత్రి, ప్రతిపక్ష నేత చేతిలో అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. కేవలం ఏడంటే ఏడే ఓట్లతో ఓటమి చెందారు. దీంతో పాక్ రాజకీయాలు మారిపోయాయి. ఇమ్రాన్ ఖాన్ రాజీనామా చేయాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ ప్రతిపక్షాలకు ముకుతాడు వేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే పార్లమెంట్‌లో విశ్వాస పరీక్షను ఇమ్రాన్ ఎదుర్కొన్నారు. ఇందులో విజయం సాధించారు.