గురువారం, 2 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఎన్.ఆర్.ఐ.
  3. ప్రత్యేక వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 6 మార్చి 2021 (11:17 IST)

దుబాయ్‌లో శివమొగ్గ వాసి పంట పండింది.. రూ.24 కోట్ల బంపర్ లాటరీ!

ఉపాధి కోసం దుబాయ్‌కు వెళ్లిన శివమొగ్గ వాసికి అదృష్టం కలిసివచ్చింది. దుబాయ్ ప్రభుత్వం నిర్వహించే లాటరీలో ఏకంగా రూ.24 కోట్ల బంపర్ లాటరీని గెలుచుకున్నాడు. ఈ అదృష్టవంతుడి పేరు శివమూర్తి కృష్ణప్ప. కర్ణాటకలోని శివమొగ్గ ప్రాంతవాసి. 
 
ఈయన వృత్తిరీత్యా ఓ మెకానికల్ ఇంజినీరు. గత 15 ఏళ్లుగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో నివసిస్తున్నాడు. ఇటీవల కృష్ణప్ప కొనుగోలు చేసిన లాటరీ (నెంబరు 202511) టికెట్‌కు ప్రథమ బహుమతి లభించింది. ఈ టిక్కెట్‌ను గత నెల 17వ తేదీన కొనుగోలు చేశాడు. 
 
ఈ బహుమతి భారత కరెన్సీలో రూ.24 కోట్లకు పైగా ఉంటుందట. గత మూడేళ్లుగా ప్రతి నెలా లాటరీలు కొంటుంటే ఇన్నాళ్లకు తన కల నెరవేరిందని కృష్ణప్ప పట్టరాని సంతోషంతో చెప్పాడు. 
 
కాగా, ఈసారి ఒకేసారి రెండు టికెట్లు కొనేందుకు నిర్వాహకులు అనుమతించడంతో తన అదృష్టం పండిందని తెలిపాడు. ఈ డబ్బుతో సొంతూర్లో ఓ ఇల్లు కట్టి, మిగతా డబ్బు పిల్లల చదువులు, వారి భవిష్యత్ కోసం దాచుకుంటానని ఆ ఇంజినీర్ వెల్లడించాడు.