శుక్రవారం, 11 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 17 మార్చి 2021 (17:56 IST)

భారత్-పాకిస్థాన్‌ల సంబంధాలకు కాశ్మీర్ అడ్డు.. ఇమ్రాన్ ఖాన్

భారత్-పాకిస్థాన్ ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణలో అడ్డుగా ఉన్న ఒకే అంశం కాశ్మీర్ అని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. కాశ్మీర్ అంశాన్ని పరిష్కరించడం ద్వారా ఇరు దేశాల స్నేహసంబంధాల పునరుద్ధరణలో భారత్ తొలి అడుగు వేయాలని ఇమ్రాన్ సూచించారు. 
 
భారత్-పాక్ సంబంధాల పునరుద్ధరణ కోసం మేం శాయశక్తులా యత్నిస్తున్నాం. కానీ ఈ దిశగా ఇండియా తొలి అడుగు వేయాలి. ఆగస్టు 5 తర్వాత భారత్ ఈ దిశగా చర్యలు చేపట్టాలి. అప్పుడే మేము కూడా ముందుకు రాగలం. మాకు కాశ్మీర్‌ విషయంలోనే సమస్య ఉంది. చర్చల ద్వారా దీన్ని పరిష్కరించుకోవచ్చు' అని ఇమ్రాన్ అన్నారు. 2019, ఆగస్టు 5న జమ్మూ కాశ్మీర్‌కు ఉన్న ప్రత్యేక ప్రతిపత్తిని కేంద్రం తొలగించిన నేపథ్యంలో ఇమ్రాన్ ఆ తేదీ ప్రస్తావన తీసుకొచ్చారు. 
 
కాశ్మీరు సమస్యను పరిష్కరించడం ద్వారా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరిచేందుకు భారత దేశం తొలి అడుగు వేయాలని పిలుపునిచ్చారు. రెండు రోజులపాటు జరిగే ఇస్లామాబాద్ సెక్యూరిటీ డయలాగ్‌లో పాకిస్థాన్ మేధావులను ఉద్దేశించి బుధవారం ఇమ్రాన్ మాట్లాడారు.