శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : సోమవారం, 22 మార్చి 2021 (10:14 IST)

తెలంగాణలో కరోనా విజృంభణ.. పాఠశాలలు, కాలేజీలు మూతపడుతాయా?

తెలంగాణ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. అలాగే పాఠశాలల్లో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. పాఠశాలల్లో క్రమంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోంది. ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు బాధితులుగా మారుతున్నారు. వందల సంఖ్యలో విద్యార్థులు వైరస్ బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో ఆదివారం ఒక్కరోజే పలు స్కూళ్లకు చెందిన 86మంది విద్యార్థులు కరోనా బారిన పడ్డారు
 
దీంతో అసలు స్కూల్స్ సేఫేనా అనే ప్రశ్న తలెత్తింది. తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల, మేడ్చల్, కామారెడ్డి, కరీంనగర్, జగిత్యాల, నిర్మల్ జిల్లాల్లోని స్కూల్స్ లో వైరస్ వ్యాప్తి చెందుతోంది. దీంతో ప్రభుత్వం కూడా వేగంగా స్పందిస్తోంది. పాఠశాలలకు సెలవులు ప్రకటించేందుకు సమాయత్తమవుతోంది. 
 
ఈ నేపథ్యంలో ఆరు నుంచి 9వ తరగతి విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేయాలని, పాఠశాలలను బంద్ చేయాలని సూత్రపాయంగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పదవ తరగతి మినహా అన్ని తరగతుల విద్యార్థులను పాస్ చేసి పై తరగతులకు ప్రమోట్ చేసే అవకాశం ఉంది. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు క్యాబినెట్ మీటింగ్‌లో మంత్రి సబిత ఇంద్రారెడ్డి విద్యాశాఖ తరుపున ప్రతిపాదనలు అందించినట్టు సమాచారం. 
 
దాదాపుగా సోమవారం నుంచే పాఠశాలలను బంద్ చేయాలనే నిర్ణయానికి ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చినట్లుగా సమాచారం అందుతోంది. ఈ విషయాన్ని నేడు అసెంబ్లీలో సీఎం కేసిఆర్ ప్రకటించే అవకాశముందని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నారు. 
 
పై తరగతులకు ప్రమోట్ చేయాలని, పాఠశాలలకు బంద్ సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. పదవ తరగతి మినహా అన్ని తరగతులకు విద్యార్థులను పాస్ చేసి పై తరగతులకు ప్రమోట్ చేసే అవకాశం వుంది. సోమవారం నుంచే పాఠశాలలను బంద్ చేయాలనే నిర్ణయానికి ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చినట్లుగా సమాచారం అందుతోంది. అసెంబ్లీ దీనికి సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. 
 
ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ముఖ్యంగా పంజాజ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శనివారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కఠిన ఆంక్షలు అమలు చేయనున్నట్లు సీఎం అమరీందర్ సింగ్ ప్రకటించారు. మార్చి 31 వరకు విద్యా సంస్థలన్నింటినీ మూసివేస్తున్నట్లు తెలిపారు.
 
ఇక దేశ వ్యాప్తంగా 8 రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్, పంజాబ్, ఢిల్లీ, గుజరాత్, కర్ణాటక, హర్యానా రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో గత 24 గంటల్లో దాదాపు 40వేల కేసులు నమోదయ్యాయి.