శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 22 మార్చి 2021 (18:36 IST)

రేషన్ రావాలంటే ఎక్కువ మంది పిల్లల్ని కనాలి.. సీఎంకు కరోనా

Tirath Singh Rawat
వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ముందుండే ఉత్తరాఖండ్ సీఎం తీరత్ సింగ్ రావత్‌కు కరోనా సోకింది. దీంతో ఆయన హోం ఐసొలేషన్‌లో ఉన్నారు. ప్రస్తుతానికి ఆయన తన ఆరోగ్యం బాగానే ఉన్నట్లు ప్రకటించాడు. 
 
ఈ మధ్యే అమ్మాయిలు జీన్స్ ధరించడంపై వివాదస్పద కామెంట్లు చేశాడు తీరత్ సింగ్ రావత్. దీనపై దేశవ్యాప్తంగా విమర్శలు ఎదుర్కొన్నాడు. దీంతో యువతుల వస్త్రధారణ మీద చేసిన తీరత్ సింగ్ రావత్ వెనక్కి తగ్గారు. తన వ్యాఖ్యలు ఎవరినైనా బాధించి ఉంటే క్షమించాలని కోరారు. జీన్స్ ధరించడం పట్ల తనకు ఎలాంటి అభ్యంతరం లేదని.. కానీ చిరిగిన జీన్స్ ధరించడం మాత్రం సమంజసం కాదని ఆయన వ్యాఖ్యానించారు. 
 
తాను ఇళ్లలో ఉండే వాతావరణం గురించి మాత్రమే మాట్లాడానని.. మంచి విలువలు, క్రమశిక్షణతో పెరిగిన చిన్నారులు జీవితంలో ఎప్పటికీ ఓడిపోరని ఆయన చెప్పుకొచ్చారు. అలాగే పేదవారికి ఎక్కువ రేషన్ రావాలంటే ఎక్కువ మంది పిల్లలను కనాలని కామెంట్ చేశాడు. దీనిపై నెటిజన్లు తీరత్ సింగ్ రావత్‌ని విమర్శిస్తున్నారు.