1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Panchayat Polls: Attempts Begin to Buy Sarpanch Posts

మా అమ్మను సర్పంచ్ చేస్తే రూ.1.20 కోట్లు ఇస్తా....

village sarpanch
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో పంచాయతీ ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో గ్రామ సర్పంచ్ పదవి కోసం అపుడే బేరసారాలు మొదలయ్యాయి. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం దుర్గాడ పంచాయతీ సర్పంచి పదవికి వేలం నిర్వహించారు. ఈ వేలం పాటల్లో ఓ వ్యక్తి పాల్గొని... తన భార్య లేదా అమ్మకు గ్రామ సర్పించ్ పదవి ఇస్తే గ్రామాభివృద్ధికి రూ.1.20 కోట్లు ఇస్తానని ఆఫర్ చేశాడు. ఇంతలోనే మరికొందరు కూడా భారీగా ఇచ్చేందుకు ముందుకు రావడంతో గ్రామ పెద్దలు వేలం పాటలు నిర్వహించారు. 
 
స్థానిక శివాలయంలో బుధవారం రాత్రి కొందరు గ్రామ పెద్దలు సర్పంచి పదవికి బహిరంగ వేలం చేపట్టారు. వచ్చిన సొమ్మును ఆలయాల అభివృద్ధికి వినియోగించాలని నిర్ణయించారు. ఇక్కడి సర్పంచి స్థానాన్ని జనరల్‌ మహిళకు కేటాయించారు. బహిరంగ వేలంలో ముగ్గురు పాల్గొన్నారు. 
 
ఈ వేలంలో నిర్ణయించిన అభ్యర్థి కాకుండా ఇతరులు ఎవరైనా పోటీ చేసినా.. హెచ్చు పాటదారును గెలిపించాలని నిర్ణయించారు. ఇదేవిధంగా వార్డు సభ్యుల స్థానాలనూ ఏకగ్రీవం చేయాలని, ఒకవేళ ఎన్నికలు జరిగితే కమిటీ మెజారిటీ సభ్యులను గెలిపించాలని తీర్మానించారు. గతంలో కూడా ఈ గ్రామంలో సర్పంచి పదవిని రెండుసార్లు వేలం వేశారు.
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
జపాన్‌కు అరుదైన ఖనిజాల సరఫరా.. కీచి ఓనో బృందం విజ్ఞప్తి