సంబంధిత వార్తలు
- 14 నుంచి అయ్యప్ప స్వామి దర్శనం... కోవిడ్ నెగెటివ్ సర్టిఫికేట్ ఇవ్వాలట...
- శ్రీనివాసుని దర్శనం కోసం బారులు తీరిన భక్తులు, సామాజిక దూరం గాలికొదిలేశారు
- లారెన్స్ ట్రస్ట్‌లోని పిల్లలకు కరోనా, వాళ్లిప్పుడు ఎలా ఉన్నారో?
- శ్రీవారు భక్తులకు దూరమై 80 రోజులు, కానీ?
- ఎస్పీ బాలు, ప్రశాంత్ నీల్‌కి పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ
శ్రీవారి భక్తులతో గోవిందనామస్మరణలతో మారుమ్రోగిన అలిపిరి
తిరుమల శ్రీవారి దర్సనార్థం సామాన్య భక్తులను ఈరోజు నుంచి అనుమతించింది టిటిడి. టోకెన్లు పొందిన భక్తులను అలిపిరి పాదాల నుంచి సప్తగిరి తనిఖీ కేంద్రం నుంచి తిరుమలకు అనుమతించారు. 80 రోజులుగా బోసిపోయిన కనిపించిన అలిపిరి సామాన్య భక్తులతో కళకళలాడింది.
గోవింద నామస్మరణలతో భక్తులు తిరుమలకు పయనమై వెళ్ళారు. నిన్న ఆఫ్‌లైన్లో 3వేల టోకెన్లను అందించింది టిటిడి. అయితే భక్తులు అధికసంఖ్యలో క్యూలైన్లలో నిలబడి ఉండటంతో 14వ తేదీ వరకు టోకెన్లను అందించారు. టోకెన్లు ఉన్న వారిని మాత్రమే అలిపిరి పాదాల మండపం తిరుమలకు అనుమతించారు.
అలాగే అలిపిరి సప్తగిరి తనిఖీ కేంద్రం వద్ద కూడా టోకెన్లను చూసిన తరువాత భక్తులను సొంత వాహనాల్లోను, ఆర్టీసీ బస్సుల ద్వారా తిరుమలకు అనుమతించారు. భక్తులు లేక వెలవెలబోయిన తిరుమల, తిరుపతి ప్రస్తుతం భక్తులతో కళకళలాడుతోంది. చాలారోజుల తర్వాత భక్తులను చూసిన స్థానికులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
టిటిడి చేసిన ఏర్పాట్లపై కూడా భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. అలిపిరి వద్ద వాహనాలకు శానిటైజేషన్ చేయడం.. భక్తులు చేతులను శుభ్రం చేసుకున్న తరువాతనే పంపిస్తున్నారు. అలాగే ఖచ్చితంగా మాస్క్‌లు ధరించాలని సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు.
తర్వాతి కథనం
