శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: శనివారం, 6 జూన్ 2020 (16:23 IST)

లారెన్స్ ట్రస్ట్‌లోని పిల్లలకు కరోనా, వాళ్లిప్పుడు ఎలా ఉన్నారో?

ప్ర‌ముఖ‌ కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు అయిన రాఘవ లారెన్స్‌కు సంబంధించిన ట్రస్ట్‌కు చెందిన చిన్నారులందరూ కరోనా వైరస్‌ నుంచి కోలుకున్నారని రాఘవ లారెన్స్‌ తెలిపారు. లారెన్స్‌ నిర్వహిస్తున్న అనాధాశ్రమంలోని 18 మంది చిన్నారులకు, ముగ్గురు సిబ్బందికి కొవిడ్‌-19 ఉన్నట్లు వైద్యులు ఇటీవల నిర్ధారించారు.
 
ఇప్పుడు వారంతా కోలుకోవడంతో లారెన్స్‌ సంతోషం వ్యక్తం చేశారు. ‘నా అభిమానులు, స్నేహితులకు నమస్కారం. ఓ మంచి విషయాన్ని మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. నా ట్రస్ట్‌లో ఉంటున్న కొంతమంది చిన్నారులు ఇటీవల కరోనా వైరస్‌ బారిన పడిన విషయం తెలిసిందే. కొవిడ్‌-19 నుంచి కోలుకోవడంతో తాజాగా వాళ్లని డిశ్చార్జ్‌ చేశారు.
 
ఈ సందర్భంగా ఎంతో సేవ చేసిన ఎస్పీ వేలుమణిగారికి, మంత్రివర్యులు జి. ప్రకాశ్‌గారికి, అలాగే డాక్టర్లు, నర్సులు అందరికీ కృతజ్ఞతలు. నా సేవే నా పిల్లలని కాపాడిందని భావిస్తున్నాను. నా పిల్లల కోసం ప్రార్థనలు చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సేవే దైవం..`అని అన్నారు రాఘవ లారెన్స్‌.