బుధవారం, 6 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By మోహన్
Last Modified: గురువారం, 4 జూన్ 2020 (11:27 IST)

ఎస్పీ బాలు, ప్ర‌శాంత్ నీల్‌కి పుట్టినరోజు శుభాకాంక్ష‌ల వెల్లువ‌

తెలుగు సినీ ప్రేక్షకులు గానగాంధర్వుడిగా పిలుచుకునే ఎస్పీ బాలు నేడు 74వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయనకు అభిమానులు, అలాగే సన్నిహితులు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేస్తున్నారు. దాదాపు 50 సంవత్సరాలకు పైగా పాటలు పాడుతూ కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు ఎస్పీ బాలసుబ్రమణ్యం. సుమారు 40 వేలకు పైగా పాటలకు పాడారు.
 
తెలుగు, తమిళం, హిందీ, కన్నడం, మలయాళం తదితర భాషల్లో పాటలు పాడి ప్రేక్షకులను అలరించారు. గాయకుడిగానే కాకుండా నటుడిగానూ, సంగీత దర్శకుడిగానూ తన ప్రతిభను చాటుకున్నాడు. చిన్నతనం నుండే పాటలను పాడటం హాబీగా మార్చుకున్నారు. 1966లో విడుదలైన 'శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న' చిత్రంతో తొలిసారి పాట పాడే అవకాశం లభించింది. హీరోల గొంతుకకు సరిపోయేలా పాటలు పాడటం బాలు ప్రత్యేకత. తెలుగులో ఘంటసాల తర్వాత ఎస్పీబీ తన గానామృతాన్ని మనకు అందించారు.
 
ఎస్పీ బాలుతో పాటు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మరో చిత్ర ప్రముఖులు ఎవరంటే.. కేజీఎఫ్ అనే కన్నడ చిత్రంతో దేశవ్యాప్తంగా ఫేమస్ అయిన దర్శకుడు ప్రశాంత్ నీల్. ఈ చిత్రం కన్నడ సినీ ఇండస్ట్రీ రికార్డ్‌లన్నీ తిరగరాసింది. కేజీఎఫ్-2తో మరోసారి సంచలనం సృష్టించనున్న ప్రశాంత్ నీల్ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారు.
 
ఈ సందర్భంగా వివిధ చిత్ర నిర్మాణ సంస్థలు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబోలో పాన్ ఇండియా మూవీ తెరకెక్కనుండగా, ఈ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్ ఏదైనా బయటకు వస్తుందేమో అని ఎన్టీఆర్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.