శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By మోహన్
Last Modified: గురువారం, 4 జూన్ 2020 (11:17 IST)

అటు నారప్ప ఇటు విరాట పర్వం, ప్రియమణి లుక్స్ రిలీజ్

దగ్గుబాటి రానా, సాయి పల్లవి హీరోహీరోయిన్‌లుగా విరాట పర్వం అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి వేణు ఉడుగుల దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం సొసైటీలో ఉన్న ఒక సమస్యను ప్రధాన కథాంశంగా తీసుకుని ఎమోషనల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ స్టీఫెన్ రిచర్డ్ ఆధ్వర్యంలో ఫైట్స్ చిత్రీకరించనున్నారు. కాగా ఈ చిత్రంలో సాయి పల్లవి నక్సలైట్ పాత్రలో కనిపించనున్నట్లు కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది.
 
ఈరోజు ప్రియమణి పుట్టినరోజు కావడంతో ఈ చిత్రంలో ఆమె పాత్రకు సంబంధించిన లుక్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. మహా సంక్షోభం కూడా గొప్ప శాంతికి దారితీస్తుందని ఆమె నమ్మింది. ఫ్రెంచ్ తిరుగుబాటులో విద్యార్థుల పాత్ర ఎంత కీలకమో విరాట పర్వంలో కామ్రేడ్ భారతక్క కూడా అంతే కీలకం అంటూ ప్రియమణి పోస్టర్‌ను రిలీజ్ చేసారు.
 
ఈ చిత్రంలోని ప్రియమణి లుక్ ఫ్యాన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటోంది. మరోవైపు వెంకీ చిత్రం నారప్పలోనూ ప్రియమణి నటిస్తున్నట్లు సురేష్ ప్రొడక్షన్స్ తెలిపింది. ఆ లుక్ కూడా ఈరోజే రిలీజ్ చేశారు. గతంలో ప్రియమణి జాతీయ ఉత్తమనటి అవార్డ్‌ను కూడా పొందారు. ఈ చిత్రంతో ఆమె మరోమారు ఇలాంటి అవార్డ్‌ను సాధించడం ఖాయం అంటూ ఆమె అభిమానులు ఆశిస్తున్నారు.