ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ప్రీతి
Last Updated : శుక్రవారం, 3 జనవరి 2020 (14:30 IST)

సూపర్ ఛాన్స్ కొట్టేసిన ప్రియమణి... హిట్ తప్పదేమో..?

సెన్సేషనల్ డైరెక్టర్ వెట్రీమారన్ దర్శకత్వంలో ఇటీవల విడుదలై తమిళంలో మంచి హిట్ అసురన్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడంతో పాటుగా 2019లో బిగ్గెస్ట్ హిట్‌గా రికార్డ్ సృష్టించింది. హీరో ధనుష్‌ నటించిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాత కలైపులి థాను తెలుగులో రీమేక్ చేయాలని భావిస్తున్నారు. ఇక నటీనటుల ఎంపిక విషయంలో జరుగుతున్న కసరత్తు ప్రస్తుతం చర్చలకు తావిస్తోంది..
 
హీరోగా వెంకటేష్ కన్ఫామ్ అయ్యారు, కానీ ఆయన పక్కన హీరోయిన్ ఎవరనే విషయం క్రేజీగా మారింది. అంతేకాకుండా అసురన్ సినిమాలో డీ గ్లామర్ పాత్రలో నటించి మెప్పించిన మంజు వారియర్‌ స్థానంలో తెలుగులో ఎవరిని తీసుకుంటారనే విషయంలో అనేక పేర్లు తెరపైకి వచ్చాయి. 
 
అనుష్క, శ్రేయా వంటి పేర్లు వినిపించినప్పటికీ ఈ క్యారెక్టర్ చివరకు ప్రియమణిని వరించినట్టు, అందుకు గానూ ఆమె అగ్రిమెంట్‌పై సంతకం కూడా చేసేసినట్లు ఓ వార్త మీడియాలో వైరల్‌గా మారింది. ఈ మేరకు మంజు వారియర్ పోషించిన పాత్రలో నటించేందుకు ఆసక్తిని చూపి అగ్రిమెంట్‌పై సంతకం చేసినట్టు తాజా సమాచారం.