1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Polavaram project funds Cut

ఏకి ప్రధాని మోడీ సర్కారు షాక్.. పోలవరం నిధుల్లో కోత

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారు మరో వాతపెట్టింది. పోలవరం నిధుల్లో కోత విధించింది. ఈ మేరకు ఓ జీవోను జారీ చేసింది. పోలవరం నిర్మాణానికి నాబార్డు ద్వారా రూ.1400 కోట్లు తీసుకునే

Polavaram project
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారు మరో వాతపెట్టింది. పోలవరం నిధుల్లో కోత విధించింది. ఈ మేరకు ఓ జీవోను జారీ చేసింది. పోలవరం నిర్మాణానికి నాబార్డు ద్వారా రూ.1400 కోట్లు తీసుకునేందుకు తొలుత అనుమతించింది. ఆ తర్వాత రెండ్రోజుల్లోనే కేంద్రం మాట మార్చింది. 
 
పోలవరానికి రూ.311 కోట్లు కోత పెట్టి కేవలం రూ.1,089 కోట్లు మాత్రమే ఇవ్వాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీని కేంద్ర జలవనరులశాఖ ఆదేశించింది. ఇప్పటికే విభజన హామీలను కేంద్రం అమలు చేయలేదని రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తున్న నేపథ్యంలో పోలవరానికి కేంద్రం ఇవ్వాల్సిన నిధుల్లో కోత విధించడంపై ప్రజలు మండిపడుతున్నారు. 
 
ప్రస్తుతం విభజన చట్టంలో ఏపీకి తీవ్రమైన అన్యాయం జరిగిందని టీడీపీ, వైసీపీ, వామపక్షాలు  ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ రెండు పార్టీలు కలిసి ప్రధాని నరేంద్ర మోడీ సర్కారుపై వేర్వేరుగా అవిశ్వాస తీర్మాన నోటీసులు ఇచ్చాయి. ఇలాంటి సందర్భంలో కేంద్రం పోలవరానికి ఇవ్వాల్సిన నిధులపై కోత పెట్టడంతో పుండుమీద కారం చల్లినట్టయింది. 
About Writer
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
జియో బేసిక్ ఫోన్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. త్వరలోనే వాట్సాప్ సదుపాయం