శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 22 మార్చి 2018 (14:48 IST)

టీడీపీ వెళ్లినా మాకొచ్చిన నష్టమేమీ లేదు : అమిత్ షా

ఎన్డీయే కూటమి నుంచి తెలుగుదేశం పార్టీ బయటకు వెళ్లినంత మాత్రానా తమకొచ్చే నష్టమేమీ లేదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వ్యాఖ్యానించారు. ఆయన ఓ జాతీయ న్యూస్ చానెల్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర

ఎన్డీయే కూటమి నుంచి తెలుగుదేశం పార్టీ బయటకు వెళ్లినంత మాత్రానా తమకొచ్చే నష్టమేమీ లేదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వ్యాఖ్యానించారు. ఆయన ఓ జాతీయ న్యూస్ చానెల్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 
 
టీడీపీ వైదొలగాలని తాము కోరుకోలేదని, వాళ్లే వెళ్లిపోవాలనుకున్నారని చెప్పారు. అలాంటప్పుడు ఎవరు ఆపగలరని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఎన్డీయే పట్ల ఆకర్షితులయ్యారని, అది వాస్తవమని అమిత్‌షా తెలిపారు.
 
టీడీపీ వీడినంత మాత్రాన నష్టమేమీ లేదని, తమ కూటమికి 30 పార్టీలు అండగా ఉన్నాయన్నారు. అలాంటప్పుడు తామెందుకు బాధపడాలని అమిత్‌షా వ్యాఖ్యానించారు. అయితే టీడీపీ తెగతెంపులు బీజేపీ దక్షిణాది ఆశలపై నీళ్లు చల్లాయని భావిస్తున్నారా అని అమిత్‌షాను అడగ్గా.. మేము దక్షిణాదిలో ఇప్పటికీ బలంగానే ఉన్నామని అమిత్‌షా వ్యాఖ్యానించడం విశేషం.