శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 22 మార్చి 2018 (12:56 IST)

పోలవరం ప్రాజెక్టును ఆపాలని చూస్తారా? దేనికైనా సిద్ధమే: బీజేపికి బాబు సవాల్

ఏపీ సీఎం చంద్రబాబు అసెంబ్లీలో మాట్లాడుతూ.. బీజేపీ, జనసేన, వైసీపీలపై మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టును ఆపేందుకు చూస్తున్నారని.. ఇందుకు పవన్, జగన్‌లను అడ్డుపెట్టుకుని బీజేపీ కుట్ర చేస్తుందని చంద్రబాబు ఆర

ఏపీ సీఎం చంద్రబాబు అసెంబ్లీలో మాట్లాడుతూ.. బీజేపీ, జనసేన, వైసీపీలపై మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టును ఆపేందుకు చూస్తున్నారని.. ఇందుకు పవన్, జగన్‌లను అడ్డుపెట్టుకుని బీజేపీ కుట్ర చేస్తుందని చంద్రబాబు ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టును ఆపి.. సీబీఐ ఎంక్వయిరీలని.. వైసీపీ, జనసేనలతో బీజేపీ ఆరోపణలు చేయిస్తుందని చెప్పారు. 
 
సీబీఐ విచారణకు ఆదేశించడం ద్వారా ప్రాజెక్టును ఆపాలనేదే బీజేపీ ఉద్దేశమని చంద్రబాబు స్పష్టం చేశారు. పోలవరంపై ఎలాంటి విచారణకైనా సిద్ధమని, ఏ ప్రాజెక్టును ఆపాలని చూసినా ఊరుకునే ప్రసక్తే లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. 
 
బీజేపీ జగన్, పవన్‌ను అడ్డుపెట్టుకుని తనపై కుట్ర చేస్తోందని.. దమ్ముంటే ప్రత్యేక హోదాపై రాష్ట్రానికి ఇచ్చిన నిధులపై పార్లమెంట్ వేదికగా చర్చించాలని సవాల్ విసిరారు. విభజన చట్టంలోని హోదా మినహా మిగతా 19 అంశాలు, ఆరు హామీలపై ఏనాడు కూడా వైసీపీ ప్రశ్నించలేదని మండిపడ్డారు.