1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. PVP comments on ysrcp chief jagan

ప్రజలకు మేలు జరగాలంటే జగన్ రావాలి: పీవీపీ

Pvp
ప్రముఖ నిర్మాత పొట్లూరి వరప్రసాద్(పీవీపీ) తాజాగా వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. మల్లాది విష్ణుతో కలిసి ఉదయాన్నే లోటస్‌పాండ్‌కు చేరుకున్న ఆయన వైకాపా అధినేత జగన్‌తో భేటీ అనంతరం వైకాపాలో చేరినట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాలలోకి వచ్చానని అన్నారు. 
 
విజయవాడ పార్లమెంట్ నుండి వైకాపా తరఫున పోటీ చేయబోతున్నానని స్పష్టం చేసిన పీవీపీ పవన్ కళ్యాణ్‌తో పాటు అందరూ తన మిత్రులేననీ.. జగన్‌తోనే ప్రజలకు మేలు జరుగుతుంది అని నమ్ముతున్నానని పీవీపీ తెలియజేసారు.
About Writer
వాసుదేవన్
తర్వాతి కథనం
ఆండ్రాయిడ్ 9.0పై ఓఎస్ అప్‌డేట్ పొంద‌నున్న షియోమీ ఫోన్లు ఇవే..